(విశాఖపట్నం,నిజం న్యూస్ )
ఎన్పీఆర్‌కు సంబంధించి 2010లోని నిబంధనలనే ఇప్పుడు కూడా పాటించాలని కేంద్రాన్ని కోరాతామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడం పట్ల కోస్తా ఆంధ్ర మైనార్టీ అధ్యక్షులు ఐ.హెచ్.ఫరూక్ హర్షం వ్యక్తం చేశారు.
విశాఖ నగర పార్టీ కార్యాలయంలో కోస్తా ఆంధ్ర మైనార్టీ అధ్యక్షులు ఐ.హెచ్.ఫరూక్ ఆధ్వర్యంలో ముస్లిం నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌర నమోదు పట్టిక నమోదులో పాత విధానాన్నే అనుసరించాలని ఎపి సిఎం జగన్ డిమాండు చేయటాన్ని స్వాగతిస్తున్నామన్నారు.ఎన్పీఆర్‌పై మైనారిటీల్లో నెలకొన్న ఆందోళనకు సంబంధించి పార్టీలో విస్తృతమైన చర్చజరిపి సరైన నిర్ణయం తీసుకొన్నారని ప్రశంసించారు. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయనుండటం పట్ల మైనారిటీవర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. తెలుగుదేశం కూడా అసెంబ్లీలో, కౌన్సిల్లో ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరారు.సిఎఎ రాజ్యాంగ విరుద్ధమని నమ్ముతున్నామని , మోదీ సర్కారు సమాన హక్కులు అవకాశాలూ అనే రాజ్యాంగ హక్కుని కాలరాచిందని ఆరోపించారు
.చంద్రబాబు నాయుడు ఇంత వరకూ ఎన్ ఆర్పీ, సిఎఎల మీద స్పందించక పోవటం దారుణమన్నారు. అమరావతి తప్ప మరో సంగతి పట్టించుకోని తెలుగుదేశం ఇకనైనా వైకాపా ఎన్ఆర్పీ మీద చేసే తీర్మానానికి మద్దతు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్ నగర మైనార్టీ విభాగ అధ్యక్షులు బర్కత్ అలీ , విశాఖ మైనారిటీ నేత, మాజీ కార్పొరేటర్ షరీఫ్, మైనార్టీ ముఖ్యనాయకులు షేక్ బాజీ గారు , షబీర్ బేగం ,కె.వి బాబా , షోకట్ అలీ , జుబేర్, ఎం.డి ముఖ్బల్ , అఫ్రూజ్, ఆజ్మ అలీ, ఎం.పి ముజీబ్ ఖాన్ తదితర పాల్గొన్నారు.