విశాఖపట్నం,నిజం న్యూస్ : కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ఉపాధి లేక నిశ్చేష్టులైన పేదలకు ఆపన్నహస్తం లా అందుకునేందుకు 95 వ వార్డు టిడిపి నాయకుడు దాట్ల హరిజగన్నాధ రాజు (దాట్ల మధు) ముందుకు వచ్చారు.వార్డు ప్రజలకు తన సేవాకార్యక్రమాలు విస్తృతం చేసారు.దీనిలో భాగంగానే గత నాలుగు రోజులుగా 95 వ వార్డు పరిధిలో గల పలు కాలనీల్లో వున్న నిరుపేద కుటుంబాలకు కాయకూరలు, గ్రుడ్లు తన సొంత ఖర్చులతో అందజేస్తున్నారు.అంతేగాకుండా కరోనా వైరస్ ప్రబలకుండా ప్రతీ కాలనీ లోను దాట్లమధు ప్రత్యక్ష పర్యవేక్షణలో రసాయనాలు పిచికారీ చేస్తున్నారు.వార్డు పరిధిలో సేవాకార్యక్రమాలకు ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు వచ్చినా మానవ సేవే మాధవ సేవ అని ఆపత్కాలంలో వార్డు ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యం గా పనిచేస్తున్నారు.
మనసున్న మా "రాజు"....దాట్ల మధు .... పేదలకు నిత్యావసరాల పంపిణీ
• nijam journalism