విశాఖపట్నం,నిజం న్యూస్ :
ప్రముఖ సంఘసేవకులు విల్లూరి భాస్కరరావు ఆర్ధిక సహాయంతో...విశాఖ దక్షిణ నియోజకవర్గం,
జ్ఞానాపురం హోల్ సేల్ కూరగాయల మార్కెట్లో పని చేస్తోన్న 450 మంది హమాలీలకు .శ్రీస్వామి వివేకానంద స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం అల్పాహారాలుఅందజేశారు.
ప్రజలకు సకాలంలో కూరగాయలు అందించాలనే లక్ష్యంతో కోవిడ్ మహామ్మారి విజృంభిస్తోన్న ఈ ప్రమాదకర సమయంలో..ప్రాణాలను పణంగా పెట్టి హమాలీలు కష్టపడుతున్నారని విల్లూరి భాస్కరరావు కొనియాడారు. ఆకలిని సైతం పక్కనబెట్టి ప్రజా సేవలో అలుపెరగకుండా రాత్రి, పగలు శ్రమిస్తున్నారని శ్లాఘించారు.ప్రజల కోసం ఇంతలా శ్రమిస్తోన్న హమాలీల కడుపు నింపడం కోసమే.ఈ సేవా కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు. ఈ సేవా కార్యక్రమంలో విల్లూరి పరమేశ్వరరావు, శీలం లక్ష్మణరావు, నిమ్మ శ్రీనివాసరావు, వి.పరమేశ్, పి.మోహన్, డి.రామకృష్ణ, ఎన్.శ్రీనివాస్, కృష్ణారావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ సంఘసేవకులు విల్లూరి భాస్కరరావు ఆర్ధిక సహాయంతో.. 450 మంది హమాలీలకు అల్పాహారాలు
• nijam journalism