జీవీఎంసీ పరిధిలో గల 22 వ వార్డు రాజీవ్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న పాలవలస లక్ష్మయ్య గత ఎనిమిది నెలలుగా లివర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. వీరు విజయనగరం నుండి వలస కూలి గా వచ్చి కుటుంబ పోషణ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వ్యాధికి గురయ్యారు. కుటుంబ పోషణ కష్టంగా ఉందని స్థానిక జన సైనికుడు పీతల మూర్తి యాదవ్ ను కలసి సహాయం చేయమని అభ్యర్థించారు .
పీతల మూర్తి యాదవ్ మానవతా దృక్పథంతో స్పందించి తక్షణమే మూడు నెలల నిత్యావసర సరుకుల తో పాటు ఐదు వేల రూపాయలు నగదును అందజేశారు.
తదుపరి వైద్యానికి అయ్యే ఖర్చులు తాను భరిస్తానని, అలాగే హాస్పటల్ కు వెళ్లి వచ్చేందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లు కూడా మూర్తి యాదవ్ చూస్తానని హామీ ఇచ్చారు. బాధితనకు భార్య రమణమ్మ, ఇంకా చదువుకుంటున్నా కుమార్తె దుర్గాభవాని కుమారుడు దుర్గాప్రసాద్ లు ఉన్నారు.
క్యాన్సర్ భాదితునికి సాయం అందించిన జనసైనికుడు మూర్తి యాదవ్
• nijam journalism