విశాఖపట్నం,నిజం న్యూస్ : బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎంతో కృషి చేసి వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు.మహాత్మా జ్యోతిరావు పూలే 194 జయంతిని పురస్కరించుకొని మద్దిలపాలెం జంక్షన్ తెలుగుతల్లి విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి శనివారం ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ కుల వివక్ష నిర్మూలనకు , మహిళా సాధికారతకు, ఎనలేని సేవలందించిన జ్యోతిరావు పూలే, ఆయన సహధర్మచారిణి సావిత్రిబాయి పూలే ల సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో జనసైనికులు పితాని ప్రసాద్ , సురేష్ మీనన్ , కూర్మి నాయుడు , దేవర రఘు, హస్మత్,మళ్ల రవి , పోతు ప్రసాద్ , శ్యామ్ తదితరులు పాల్గొన్నారు
మహత్మ జ్యోతీరావ్ పూలేకి నివాళ్ళు అర్పించిన జన సైనికుడు పీతల మూర్తి యాదవ్
• nijam journalism