(విశాఖపట్నం,నిజం న్యూస్ ) రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం ,ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం సింహాచలం అప్పన్న ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది.దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వులతో గురువారం ఉదయం ఆలయంలోని స్వామివారి ఆలయ కల్యాణ మండపంలో నూతనముగా నియమితులైన పదిమంది సభ్యులతో ఆలయ ఇఒ వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత ట్రస్టు బోర్డు సభ్యులుగా దాడి దేవి, వారణాసి దినేష్ రాజు, నల్లమిల్లి కృష్ణారెడ్డి, జి శ్రీదేవి , రాగాల నరసింహ రావు నాయుడు, సూరి శెట్టి సూరిబాబు, రంగోలి పోతన్న,డొంకాడ పద్మావతి,నడిమింటి చంద్రకళ, సిరిపురపు ఆశా రాణి అందరి చేత ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు.ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు యువజన సర్వీసుల శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాస రావు, శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ సంచయిత గజపతిరాజు , పెందుర్తి శాసనసభ్యులు అదీప్ రాజ్ , గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగి రెడ్డి , దేవస్థానం అధికారులుపాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ ఇఒ వెంకటేశ్వరరావు,అర్చకుల బృందం కొత్తగా ఏర్పడిన ట్రస్టుబోర్డు సభ్యులకు కండువాలు కప్పి సత్కరించారు. దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత నూతన ట్రస్ట్ బోర్డు ఏర్పారు కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.