జి.వి.యం.సి. పరిధిలో కరోనా వైరస్ కట్టడికి భారీ వాహన యంత్రాల ద్వా రా రసాయనాలు పిచికారి 


విశాఖపట్నం , మార్చ్ 27: జి.వి.యం.సి. కమీషనర్ డా.జి.సృజన ఆదేశాల మేరకు నగర పరిధిలో కరోన వైరస్ కట్టడి సాధనాలలో భాగంగా, జిల్లా అగ్నిమాపక మరియు విపత్తుల నిర్వహణ శాఖ వారి సహకారంతో జి.వి.యం.సి. పారిశుధ్య విభాగపు అధికారులు, సిబ్బంది మరియు యు.సి.డి. సిబ్బంది అగ్నిమాపక శకటాలతో, సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని, నగర పరధిలో చల్లుటకు చర్యలు ప్రారంభించారు. ఈ రోజు మూడు శకటాలతో సమస్యాత్మక ప్రాంతమైన పూర్ణ మార్కెట్ ఏరియా, అల్లిపురంలో వివేకానంద నగర్ కొలనీలోను మరియు చుట్టూ ప్రక్కల ప్రాంతాలలోను సీతమ్మధార, హెచ్.బి.కొలనీ తదితర ప్రాంతాలలో రసాయన ద్రావణాన్ని చల్లడం మొదలెట్టారు. ఈ రసాయన ద్రావణాన్ని చల్లడం వలన, అదే రోజు వెంటనే గాలిలోనూ, భూమి మీద ఉన్న వైరస్ నిర్వీర్యం అగుటకు వీలుండటం వలన, నగర పరధిలో గల సమస్యాత్మక ప్రాంతాలు, మురికివాడలలోన, ప్రజా రద్దీ ప్రాంతాలైన రైతు బజార్లు, మార్కెట్లు మొదలగు ప్రాంతాలలో ముఖ్యంగా విదేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి నగరానికి వచ్చిన గృహ నిర్బంధంలో ఉన్న ఏరియాలలో రసాయన ద్రావణాన్ని చల్లడం ప్రారంభించారు. ఇది నగర పరిధిలో అంత విస్తరిస్తారు. ఇంకా అదే ప్రాంతాలలో గృహ సర్వేలో వచ్చిన జ్వర పీడుతులున్న గృహములందు కూడా విచారించి, గృహాలలో కూడా ద్రావణం చల్లడం చేస్తున్నారు.కావున ప్రజలందరూ జి.వి.యం.సి సిబ్బందితో సహకరించి, పట్టణ పరిధిలో కరోనా వైరస్ నియంత్రణకు తోడ్పాటు అందించాలని జి.వి.యం.సి. కమీషనర్ ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేసారు.ఈ కార్యక్రమంలో జి.వి.యం.సి. సి.ఎం.ఓ. హెచ్. K.S.L.G శాస్త్రి, Biologist పైడిరాజు, పి.డి. యు.సి.డి. వై. శ్రీనివాసరావు,జిల్లా అగ్నిమాపక అధికారి సురేంద్ర ఆనంద్, అదనపు జిల్లా ఫైర్ అధికారి మార్టిన్ లూథర్ కింగ్ తదితరులు పాల్గొన్నారు. -