(విశాఖపట్నం,నిజం న్యూస్) రాష్ట్ర లో ఎన్.ఆర్.సి అమలు జరిపేది లేదని రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన రెడ్డి ఇచ్చిన స్పష్టమైన నిర్ణయాన్ని స్వాగతిస్తూ వైస్సార్సీపీ నగర పార్టీ కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. పార్లమెంట్ మైనార్టీ విభాగ అధ్యక్షులు బర్కత్ అలీ , నగర మైనార్టీ విభాగ అధ్యక్షులు షరీఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానకి ముఖ్య అతిదిగా నగర పార్టీ అధ్యక్షులువంశీ కృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయమని, వైసీపీ మైనార్టీ ల పట్ల చిత్త శుద్దితో ఉంది అనడానికి ఇదే నిదర్శనం అని అన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, నాయకులు, మైనార్టీ పెద్దలు పాల్గొన్నారు..
జగన్ చిత్రపటానికి పాలాభిషేకం