జివిఎంసి ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కృషిచేయాలి - జివిఎంసి ఇన్‌ఛార్చి కమిషనర్ వి.కోటేశ్వరరావు


విశాఖపట్నం, మార్చి 09 :- జివిఎంసి పరిధిలో చాలా సంవత్సరముల తర్వాత ఎన్నికు జరుగుచున్నందున, ఎటువంటి అవాంతరములు తలెత్తకుండా చూస్తూనియమాళిననుసరించి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి జివిఎంసిలోగల ప్రతి అధికారి, ఉద్యోగి, జోనల్ కమిషనర్లు మరియు సిబ్బంది, రిటర్నింగు అధికారులు, అసిస్టెంటు రిటర్నింగు అధికారులు తగు కృషిచేయాలని కోరారు. ప్రధాన కార్యలయపు సమావేశపు మందిరం నుండి జోనల్ కమిషనర్లు ఎన్నికల సిబ్బంది రిటర్నింగు మరియు అసిస్టెంటు, రిటర్నింగు అధికార్లుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పలు సూచనలు చేశారు. రిటర్నింగు అధికారులు/ అసిస్టెంటు రిటర్నింగు అధికారులకు వార్డుల వారీగా ఉండడానికి మరియు ఎన్నికల సామగ్రిని భద్రపర్చుకోవడానికి జోనల్ కమిషనర్లు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల సామగ్రిని, బ్యాలెట్ పేపర్లును పోలింగు సిబ్బందికి అందించడానికి, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని మరలా పోలింగు అయిన తర్వాత రిసెప్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని, వాటికి సంబంధించిన రూటు మ్యాపులను తయారు చేసి, ప్రధాన కార్యాలయంలో గల ఎన్నికల విభాగంలో అందించాలని ఆదేశించారు. నోడల్ అధికారులు, రూటు ఆపీసర్లు నియమకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని, ఎన్నికల నియమావళి అమలులో నిర్లిప్తత వహించరాదని సూచించారు. పారదర్శకంగా ఎన్నికలు జరిగేటట్లు తగు జాగురూకత వహించాలని, జోనల్ కమిషనర్లు ను ఆదేశించారు. ఓటర్ల జాబితాలను కూడా ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో అదనపు కమిషనర్లు తమీమ్ అన్సారియా, జి.వి.రమణి, సోమన్నారాయణ, జివిఎంసి కన్సల్టెంటు జివివిఎస్ మూర్తి, డిసిఆర్ ఫణిరామ్ పాల్గొని కొన్ని సూచనలు చేశారు. ఇంకా పి.డి.యుసిడి శ్రీనివాసరావు, చీఫ్ ఇంజనీరు వేంకటేశ్వరరావు, జాయిమట్ డైరక్టర్ (అమృత్) సత్యనారాయణ, ఎన్నికల విభాగపు సిబ్బంది పాల్గొన్నారు.