(విశాఖ పట్నం,నిజం న్యూస్ )
నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ పై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్ ఎస్.ఏ. రెహమాన్ కొనియాడారు. గురువారం స్థానిక హోటల్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా నలబై లక్షల అనాథలు,చాలా మంది గిరిజనులు,సంచార జాతులు వారున్నారు. వీరందరికీ వారి పుట్టిన తేదీ కూడా తెలియదు. వారి పూర్వీకులు విషయాలు ఎలా చెప్పగలరు. అదే విదంగా మద్యం పాలసీ ని వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలు గత ప్రభుత్వ హయాంలో దోచేసిన విషయం గుర్తు లేదా అని ప్రశ్నించారు. స్థానిక టీడీపీ నేత వద్ద మద్యం బాటిల్ లు అధికంగా వుంటే ఎందుకు కేసులు పెట్టలేదు. ఎన్టీఆర్ మద్యపాన నిషేదం అమలు చేస్తే దానికి తూట్లు పొడిచి మధ్య పాన నిషేధాన్ని ఎత్తివేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. ఎన్ని కల అనంతరం మాట ఇచ్చిన ప్రకారం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అంచెలంచెలు గా మద్య పాన నిషేధాన్ని అమలు చేస్తున్నారు. జగన్మోహనరెడ్డి ఒక సంఘ సంస్కర్త గా పని చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ నేతలంతా అబద్ధాలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాలు ను వ్యతిరేకిస్తూ జే ట్యాక్స్ అనడం సమంజసం కాదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై కూడా అభిమానం వుంది. కానీ జగన్మోహనరెడ్డి చేస్తున్న మంచి పనులను స్వాగతించాల్సింది పోయి వ్యతిరేకించడం తప్పు కాదా. అప్పటి లో ఆరు వందల కోట్లు ముడుపులు తీసుకుని టీడీపీ హయాంలో బేవరేజస్ కి అనుమతులు ఇచ్చారు. మద్యనిషేద అమలులో ఏమైనా లోటుపాట్లు వుంటే సలహాలు ఇవ్వాలన్నారు.టీడీపీ హయాంలో చేసిన వ్యవహారం అంతా జీవో లతో సహా బయట పెడతాను. మద్యనిషేద అమలు బాగా జరుగుతుంది. మహిళలంతా ఆనందంగా వున్నారు. క్రమ క్రమంగా మద్యం అలవాటు నుంచి బానిసలు బయట పడుతున్నారు. ఈ ఉత్తరాంధ్ర ముస్లింల సంక్షేమ సంఘం కార్యదర్శి రహమతుల్లా బేగ్, ఎమ్. ఏ. రజాక్, డాక్టర్ మహ్మద్ సాదిక్, మహ్మద్ ఆలీ, జలాల్ బోకారి, అబ్దుల్ సమద్, మహమ్మద్ ఇస్మాయిల్, నౌషాద్, ఎమ్. జి. ఎమ్. ఖాన్, ఎమ్. ఏ. అజీజ్ అలీ, సయ్యద్ అలీ పాల్గొన్నారు
ఎన్ పి ఆర్ పై ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం ..... మాజీ ఎమ్మెల్యే రెహమాన్