విదేశాల నుంచి ఎవరైనా వచ్చారా ... కరోనాపై కదిలిన వైద్యశాఖ

విదేశాల నుంచి ఎవరైనా వచ్చారా ...
కరోనాపై కదిలిన వైద్యశాఖ
ఇంటింట సర్వే చేస్తున్న గ్రామ వలంటీర్లు
విదేశాల నుంచి వచ్చిన వారి వివరాల సేకరణ
(విశాఖపట్నం,నిజం )
గత నెల రోజుల నుంచి ఎవరైనా విదేశాల నుంచి స్వస్థలాలకు వచ్చారా? వస్తే ఎందరు? ఎక్కడకు  వచ్చారు? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడెక్కడ తిరిగి ఎవరెవరిని కలిసారు.? ఈ వివరాలు ఆరా తీయడంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖఇంటింటి సర్వే చేపట్టింది.  
. ఇదే సమయంలో వైద్య సిబ్బందిని సంబంధిత అధికారులు అప్రమత్తం చేసారు. ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే అందించాలని సూచించడంతో క్షేత్రస్థాయిలో వివరాలను ఆరా తీస్తున్నారు. ఈ నెల మొదట్లో ఖతార్‌, సౌదీ, దుబాయి తదితర దేశాల నుంచి వచ్చిన వారి పేర్లు వివరాలు,అడ్రసులను పోలీసుల ద్వారా తీసుకొన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముందుగా ఆ ఇళ్ళకి వెళ్లి వల్లనా నుంచి వివరాలు సేకరిస్తున్నారు.అనంతరం ఇంటింటి సర్వే చేపడుతున్నారు.వైద్య ఆరోగ్య సిబ్బందికి స్థానిక ఏ ఎన్ఎం ,గ్రామా వాలంటీర్ సహకరిస్తున్నారు.అధికారులు ఇచ్చిన ఫారం ప్రకారం ప్రశ్నలను అడిగి వివరాలు సేకరిస్తున్నారు.
విదేశాలనుంచి వచ్చిన వారి ఇతర కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా  కరోనా లక్షణాలతో బాధపడుతున్నారా? లేదా అన్న దిశగా వివరాలు సేకరిస్తున్నారు.ఫిబ్రవరి 10 తర్వాత చైనా నుంచి  లేదా ఇతర దేశాల నుంచి  ఎవరైనా  వచ్చారా అన్న అంశాన్ని వలంటీర్లు తెలుసుకొంటున్నారు.ఇంటింటికీ తిరిగి ఈ వివరాలను నమోదు చేయాలని వారికీ ఆదేశాలు అందాయి..  కరోనా వైరస్‌ లక్షణాలున్న వారిని  ఐసోలెషన్‌ వార్డుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.