వ్యభిచారం కేసులో జబర్దస్త్ నటులు దొరబాబు,పరదేశి అరెస్టు

జబర్దస్త్  నటులు  దొరబాబు,పరదేశి   అరెస్టు
(విశాఖపట్నం,నిజం న్యూస్)
 జబర్దస్త్  లో  నటిస్తున్న దొరబాబు,పరదేశి  పాటుగా మరో ముగ్గురు వ్యక్తుల్ని మాధవధార లోని ఓ బహుళ అంతస్తుల అపార్ట్ మెంట్ ప్లాట్ లో నడుస్తున్న వ్యభి చారం గృహంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. గత కొంతకాలంగా ఆ అపార్ట్మెంట్లో వ్యభి చారం జరుగుతున్నదన్న సమాచారంతో నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఒక మహిళ, నలుగురు విటులను పట్టుకొని ఎయిర్పోర్టు పోలీసులకు అప్పగించారు. వీరిలో దొరబాబుతో పాటుగా మరో ముగ్గురు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.