కేన్సర్ రోగికి 50 వేలు ఆర్ధిక సహయమందించిన పీతల మూర్తి యాదవ్

 


 


(విశాఖపట్నం, నిజం న్యూస్ )


22 వ వార్డు శివాజీ పాలెం చిన్న పోలమ్మ గుడి ప్రాంతానికి చెందిన తోనంగి పైడ్రాజు భార్య శ్యామల బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో గత కొన్ని రోజులుగా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
 వీరి ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్న నేపథ్యంలో రోగి కి ఆర్థిక సహాయం అందించేందుకు 22 వ వార్డు జన సైనికుడు  పీతల మూర్తి యాదవ్ 50, 000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. 
 గతంలో కూడా లో ఓ క్యాన్సర్ రోగి కి ఆర్థిక సాయం చేశారు. ఆమె కోలుకొని ఆరోగ్యంతో ఉన్నారు. 
 శ్యామల భర్త పైడిరాజు ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఈ ఆపద కాలంలో  ఆర్థికంగా మమ్మల్ని ఆదుకున్న పీతల మూర్తి యాదవ్ మా పాలిట దేవుడు అని పేర్కొన్నారు. రోగి బంధువులు తోనంగి కొండమ్మ, శ్రీను, కొయ్య సోమేశ్', అడ్డూరి చిట్టి తదితరులు మూర్తి సేవలను కొనియాడారు.