ఏపీలో  మార్చి 31వరకు లాక్‌డౌన్ .. సీఎం జగన్

ఏపీలో  మార్చి 31వరకు లాక్‌డౌన్ 
సీఎం జగన


ఏపీలో  మార్చి 31వరకు లాక్‌డౌన్ 
సీఎం జగన్
(అమరావతి, నిజం న్యూస్)


ఆంధ్రప్రదేశ్‌లో కూడా లాక్‌డౌన్ ఉంటుందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మార్చి 31 వరకు లాక్‌డౌన్ ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. 31 తర్వాత పరిస్థితులు సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆదివారం సాయంత్రం మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. జనతా కర్ఫ్యూ, కరోనా పాజిటివ్ కేసుల గురించి మాట్లాడారు. 
31 వరకూ ఇళ్లలోనే ఉండండి!


‘ప్రజా రవాణా జరగదు. పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు నిలిపివేస్తున్నాం. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు బంద్‌ కానున్నాయి. అత్యవసర సర్వీసులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. నిత్యావసర షాపులు తప్ప మిగతా దుకాణాలు బంద్‌ కానున్నాయి. గోడౌన్లు, ఫ్యాక్టరీలు తక్కువ సిబ్బందితో నడపాలి. ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలి. అంతర్రాష్ట్ర సరిహద్దుల్ని మూసివేస్తున్నాం. నిత్యవసర షాపులు తప్ప దుకాణాలు మూసివేయాలి. విదేశాల నుంచి వచ్చినవాళ్లు కచ్చితంగా 14 రోజులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలి. ఈ నెల 31 వరకూ అందరూ ఇళ్లలో కూర్చోగలిగితే కరోనా వైరస్‌ను తరిమికొట్టగలం’ అని సీఎం జగన్ స్పష్టం చేశారు. 


సీఎం జగన్ మీడియా మీట్ పాయింట్స్:
అసెంబ్లీ పెట్టక తప్పదు...బడ్జెట్ పెట్టాల్సిన పరిస్థితి.. వీలైనంత తక్కువ రోజుల్లో ముగించేలా పెడతాం.. 


నిత్యావసర సరుకులు ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు..


జైల్ కి కూడా పంపే విధంగా చర్యలు...


త్వరలోనే సరుకుల రేట్లు కలెక్టర్లు ప్రకటిస్తారు...


రైతు కూలీలకు తప్పదు అనుకుంటేనే వెళ్ళండి.. 


పాలు, నీరు, కూరగాయలు, మందులు, పెట్రోల్ బ్యాంక్స్, lpg, తెరిచి ఉంటాయి..


10 మంది ఒకచోట ఉండొద్దు.. 


జాగ్రత్తలు తీసుకోకపోతే ఏ స్తాయిలోకి వెళ్తుందో అనే భయం ఉంది..


సరైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలకు ఇబ్బంది ఉండదు..


పెద్దవాళ్ళని, చిన్న పిల్లలని కాపాడుకోవాల్సిన అవసరం మనపై ఉంది..


దయచేసి ఇంటి నుండి బయటకు రావద్దు..


వరకూ ప్రజలంతా దయచేసి ఇళ్ళల్లోనే ఉండడి..


ఇలాంటి లాక్ డౌన్ వల్ల పేదవారికి ఇబ్బంది వస్తుంది..


వాళ్ళకి 29 తేదీ నాటికి రేషన్ ఇస్తాం..


రేషన్ తో పాటు kg పప్పు.. కుటుంబానికి వెయ్యి రూపాయలు..


ఏప్రిల్ 4 తేదీన ఇంటింటికి ఇస్తాం..


ఇంకా ఎక్కువ చేయాలన్నా.. ఆర్ధిక పరిస్థితి బాలేదు కనుక చేయ్యలేకపోతున్నా . దయచేసి అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నా..


ఈ మాత్రానికే 1500 కోట్లు ఖర్చు అవుతుంది..