మార్చి నాటికి వోల్వో బస్సులు : ఏపీఎస్ ఆర్టీసీ చైర్మెన్

మార్చి నాటికి వోల్వో బస్సులు : ఏపీఎస్ ఆర్టీసీ చైర్మెన్


విశాఖపట్నం : మార్చి నాటికి ఏపీలో వోల్వో బస్సులు అందుబాటులోకి వస్తాయని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నాడు వాల్తేర్ బస్ డిపో‌ను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖ రాజధాని అనేది 13 జిల్లాలకు సంబంధించినదని.. అందుకే స్కూల్ పిల్లలను భాగస్వామ్యం చేసి బస్‌లపై అందమైన పెయింటింగ్  వేయించామన్నారు. ప్రజా రవాణా ప్రజల అవసరాలకు అనుగుణంగా, మరింత దగ్గర ఉండాలని అనుకుంటున్నాంమని మాదిరెడ్డి తెలిపారు. వోల్వో బస్‌లను కూడా కొనుగోలు చేశామని వాటికి  డాల్ఫిన్ ఆకారంలో ముఖ చిత్రం పెట్టినట్లు తెలిపారు. ఈ బస్సులు మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు