- ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి
విశాఖపట్నం, విజన్ న్యూస్: జి.వి.ఎం.సి. ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యొగులు గా గుర్తిస్తూ 010 పద్దు ద్వారా జీతాలు చెల్లిస్తూన్నందున తక్షణమే మెడికల్ కార్డులు జారీ చేయాలని జి.వి.ఎం.సి. స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్. పద్మనాభరాజు, బుగత వెంకట నారాయణలు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి ని కోరారు. బుధవారం తాడేపల్లి లో వైయస్సార్ టి.యు. రాష్ర్ట అధ్యక్షుడు గౌతం రె్డ్డి ఆధ్వర్యంలో జి.వి.ఎం.సి. స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామక్రిష్టా రెడ్డి ని కలిసి, వినతి పత్రం అందజేశారు. ఈ సంధర్భాంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, పద్మనాభరాజు, వెంకట నారాయణ లు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ళుగా జి.ఓ.నెంబర్.212 వల్ల రెగ్యులర్ కాకుండా మిగిలిపోయిన తాత్కాలిక, ఎన్.ఎం.ఆర్. బదిలి వర్కర్లు, సిహెచ్, వి, ఇతర ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరామన్నారు. ముఖ్యంగా జి.వి.ఎం.సి ఉద్యొగులందరికి, నగర పరిధిలో నే ఇళ్ళ స్థలాలు, ఇప్పించాలని, కార్పోరేషన్‌లో ప్రజారోగ్య విభాగంలో ని మలేరియా సెక్షన్‌లోని 450 మంది సీజనల్ వర్కర్లును వెంటనే విధుల్లోకి తీసుకొని నగర వాసులకు, డెంగ్యూ, మలేరియా, చికిన్ గున్యా, ఇతర అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపటా్టలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వి.వామనరావు ఆదేశాలు సూచనల మేరకు విన్నపించామన్నారు. వీటిని పరిశీలించిన సజ్జల, ఉద్యోగుల డిమాండ్ల ను త్వరితగతిన పరిష్కరిస్తామని హామి ఇచ్చానట్టు చెప్పారు.
జి.వి.ఎం.సి. ఉద్యొగుల సమస్యలను పరిష్కరించేందుకుచర్యలు