విశాఖపట్నం,నిజం న్యూస్ ; జగనన్న ప్రభుత్వం చిరువ్యాపారులకు అండగా ఉంటుందని విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి అక్కరమాని విజయనిర్మల పేర్కొన్నారు. మంగళవారం ఆర్కే బీచ్ శ్రీ షిరిడి సాయి వర్తక సంఘం సభ్యులు ఆమెను కలసి తమ సమష్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చిరువ్యాపారులకు, తోపుడు బండ్ల వ్యాపారులకు ఏ సమష్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తా మన్నారు. సంఘం ప్రతినిధులు కట్టా రాజు, దండు త్రినాధ్, వైసీపీ నాయకులు మరడ శ్రీనివాసరెడ్డి తదితరులు ఆమెను కలసి తమ సమష్యలను వివరించగా, వాటన్నింటి పరిస్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
చిరువ్యాపారులకు అండగా జగనన్న ప్రభుత్వం.