జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపి
(విజయనగరం - నిజం న్యూస్ )
న్యాయ సేవలలో భాగంగా పారా లీగల్ వాలంటీర్లు చట్టాలపై అవగాహన ఏర్పర్చుకోవాలని, చట్టాలు గురించి ప్రజకు వివరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపి అన్నారు. మంగళవారం న్యాయ సేవా సదన్ భవనంలో పారా లీగల్ వాలంటీర్లకు ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా మొదటిరోజు ఓరియంటేషన్ కోర్సు పై శిక్షణ ఇవ్వడం జరిగింది. రాజ్యాంగంలోని 39 ఎ ఆర్టికల్, న్యాయ సేవాధికార చట్టం గురించి జిల్లా ప్రధాన న్యాయమూర్తి వివరించారు. సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్ద కార్యదర్శి వి. లక్ష్మీ రాజ్యం పారా లీగల్ వాలంటీర్ల యొక్క విధి విదానాలను వివరించారు. సీనియర్ న్యాయవాది ఐ. సురేష్ రాజ్యాంగం, ప్రాధమిక హక్కులు, విధులు, ఆదేశ సూత్రాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పలు పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.