కాన్సర్ రోగికి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బాసట
-రూ.3లక్షల పీ ఎం ఎన్ ఆర్ ఎఫ్
కేటాయింపు
విశాఖపట్నం , ఫిబ్రవరి 25,నిజంన్యూస్
వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ ఆసుపత్రి లో కాన్సర్ తో బాధపడుతున్న ఓ వ్యక్తికి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బాసటగా నిలిచారు . విశాఖ నగరానికి చెంది ప్రస్తుతం పుదుచ్చేరి లో నివాసముంటున్న కామన వెంకట నారాయణ గత కొంత కాలంగా
ఈ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో చికిత్స చేయాలని వైద్యులు సూచించడంతో ఆ కుటుంబ సభ్యులు ఆర్ధిక సహాయార్ధం ఎంపీ ఎంవీవీ ని ఆశ్రయించారు. స్పందించిన ఎంవీవీ
ప్రధాన మంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద దరఖాస్తు చేయించారు. . తదుపరి ఆసుపత్రి ఖర్చులకు రూ.3 లక్షల మంజూరు కేంద్రం నుంచి లభించింది. ఆ మంజూరైన. పత్రాన్ని ఎంవీపీ కాలనీ లో ఉన్న
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పార్టీ ఆఫీసు లో మంగళవారం అందజేశారు. ఈ సందర్భం గా వెంకటనారాయణ మాట్లాడుతూ ఆర్ధికంగా పరిపుష్టి లేనితమకు దన్నుగా నిలిచి , ఈ సహాయం తమకు అందజేసేందుకు కృషిచేసిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కి ప్రత్యేక కృతజ్ఞతలుతెలియజేశారు. ఎంపీ మాట్లాడుతూ తన పార్లమెంట్ పరిధిలోఉన్న ప్రతి ఒక్కరికీ తన సహాయ సహకారాలు ఉంటాయన్నారు.
క్యాన్సర్ రోగికి ఎంపీ ఎంవీవీ బాసట