బీసీ కమిషన్ సభ్యుడిగా పక్కి దివాకర్


( విశాఖపట్నం, నిజం న్యూస్ )  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడిగా పక్కి వెంకటసత్య దివాకర్ ను నియమిస్తూ సోమవారం ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎ.శంకరనారాయణ చైర్మన్‌గా
ముగ్గురు సభ్యులతో కలిసి రాష్ట్ర బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన గతంలో రాష్ట్ర బీసీ డెవలప్మెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. బీసీ కుల సంఘాలను సంఘటిత పరచడం లో కీలకపాత్ర పోషించారు. వెనుకబడిన కులాల్లో ఒకటైన సంచార జాతులకు గుర్తిం పు కోసం గతంలో ఎన్నో పోరాటాలు చేశారు. వారికి గృహవసతి కల్పించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు.