(శ్రీకాకుళం, నిజం న్యూస్ )
అనేక అవసరాలను వివిధ తరహాలో డబ్బును అతిసులువుగా లావాదేవీలు జరుపుకొనే పే టీ ఎం యాప్ పై ఇప్పుడు సైబర్ నేరగాళ్ల ద్రుష్టి పడిందని ఎస్పీ ఆర్.ఎన్. అమ్మిరెడ్డి పేర్కొన్నారు. ఈ మోసాలు పై ప్రజల ను అప్రమత్తంగా ఉండాలని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇప్పుడు అపరిచిత వ్యక్తి మీ ఆండ్రాయిడ్ మొబైల్ కు కాల్ గాని లేదా ఎస్ ఎం ఎస్ రూపంలో గాని మీ పీటీఎమ్ కే వై సీ బ్లాక్ ఐయిందని, మీరు ఈ నెంబర్ కు కాల్ చేయండని గాని, లేదా మీకు ఒక దరఖాస్తు సెండ్ చేస్తాం మీ వివరాలు అందులో నమోదు చేయమని చెప్పుతారు. నమ్మి వివరాలు నమోదు చేసినా, ఫోన్ లేదా ఎస్ ఎం ఎస్ ద్వారా వివరాలు అందించారా,... మరుక్షణం మీ ఖాతా లో సోమ్ము మాయమైపోతుందని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు. . బ్యాంక్ అధికారులు గాని ఫోన్ ద్వారా ఎటువంటి సమాచారం
అడగరని, వినియోగదారుల కు అనుమానం, సమస్య ఉన్నా, నేరుగా సంప్రదించడం మంచిదని తెలిపారు. అంతేగాని సైబర్ నేరగాళ్ల మాయలోపడి సొమ్మును పోగొట్టుకోరాదని, జిల్లా ఎస్పీ ఆర్. ఎన్. అమ్మిరెడ్డి ఒక పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేసారు.
ఆన్ లైన్ మోసాలపై మరింత అప్రమత్తముగా ఉండాలి... ఎస్పీ ఆర్.ఎన్ అమ్మిరెడ్డి..